Andhra Pradesh: అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను రద్దు చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు.. అచ్చెన్నాయుడి ముఖ్య అనుచరుడుని విచారించిన సీఐడీ

  • ఆర్థిక ఇబ్బందుల కారణంగా పథకాలను రద్దు చేసినట్టు పోస్ట్
  • తనకు వచ్చిన పోస్టును షేర్ చేసిన అప్పిని వెంకటేశ్
  • నిన్నంతా విచారించిన పోలీసులు
  • సీఐడీ అధికారులపై టీడీపీ నేతల ఆగ్రహం
AP TDP Chief Atchannaidu Aide in CID Custody

ఆర్థిక ఇబ్బందుల కారణంగా అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై గత నెల 30న కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు.. నిన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ముఖ్య అనుచరుడిని అదుపులోకి తీసుకున్నారు. టెక్కలి నియోజకవర్గ ఐటీడీపీ కో ఆర్డినేటర్ కూడా అయిన అప్పిని వెంకటేశ్‌ పథకాలు రద్దు చేసినట్టు తనకు వచ్చిన పోస్టులను షేర్ చేశారు. 

ఈ కారణంతో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు సీఐడీ కార్యాలయానికి చేరుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు ఆయనను పిలిపించి విచారించడం  ఏంటని నిలదీశారు. దీంతో శుక్రవారం ఉదయం రావాలంటూ వెంకటేశ్‌ను పంపించివేశారు.

More Telugu News