monkey pox: సామూహిక వ్యాప్తి దశకు మంకీ పాక్స్.. యూకే హెల్త్ ఏజెన్సీ ప్రకటన

  • ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నట్టు వెల్లడి
  • ఇంగ్లండ్ లో మొదటిసారిగా గుర్తింపు
  • స్వలింగ సంపర్కంతో వ్యాపిస్తున్నట్టు అనుమానం
Health agency confirms community spread of monkey pox in England

మంకీ పాక్స్ వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి దశకు చేరినట్టు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తాజాగా ప్రకటించింది. వాస్తవానికి ఇది మైల్డ్ వైరస్. కరోనా అంత శక్తిమంతమైనది కాదు. పశ్చిమ, సెంట్రల్ ఆఫ్రికాలో ఈ వైరస్ ప్రభావం ముగింపు దశకు వచ్చింది. కానీ, అక్కడి నుంచి ఇతర దేశాలకు ఇది చేరుతోంది. మే ముందు వరకు ఆఫ్రికా బయట మంకీ పాక్స్ వైరస్ కేసులు పెద్దగా లేవు. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యకు  (ఆఫ్రికా బయట) ఈ కేసులు పెరిగిపోవడం గమనార్హం.

‘‘ఇంగ్లండ్ లో మంకీ పాక్స్ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపించడం ఇదే మొదటిసారి. ఈ వ్యక్తులు ఆఫ్రికాలో ప్రయాణించినట్టు ఆధారాల్లేవు’’ అని యూకే హెల్త్ ఏజెన్సీ పేర్కొంది. యూకేలో అధికంగా 132 కేసులు లండన్ లోనే ఉన్నాయి. ఇందులో 111 కేసులు సంపర్కం (ఇద్దరు పురుషులు మధ్య సంభోగం, ద్విలింగ సంపర్కం) వల్ల వ్యాపించినవిగా యూకే హెల్త్ ఏజెన్సీ ప్రకటించింది. మహిళల్లో కేవలం రెండు కేసులు నమోదయ్యాయి. బవారియన్ నార్డిక్ కు చెందిన ఇమ్ వానెక్స్ టీకాను మంకీ పాక్స్ బాధితులు, అనుమానితులకు ఇస్తున్నారు.

ఆఫ్రికా బయట ప్రధానంగా యూరోప్ లోనే మంకీ పాక్స్ కేసులు పెరుగుతుండడం అక్కడి అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ప్రధానంగా పురుషుల మధ్య శృంగారం (గే) రూపంలో ఇది వ్యాప్తి చెందుతున్నట్టు అనుమానిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో 550 మంకీ పాక్స్ కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ప్రకటించింది. 

More Telugu News