Kamal Haasan: అదే 'విక్రమ్' స్పెషాలిటీ: కమల్

  • రేపు విడుదల కానున్న 'విక్రమ్'
  • ప్రమోషన్స్ లో బిజీగా కమల్
  • లోకేశ్ కనగరాజ్ కి కమల్ కితాబు
  • తప్పకుండా హిట్ అవుతుందనే ఆశాభావం  
Vikram movie update

కమల్ తన సొంత బ్యానర్లో సినిమా చేయక .. సంచలన విజయన్ని నమోదు చేయక చాలా కాలమైంది. ఈ సారి తప్పకుండా బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన తన సొంత బ్యానర్లో 'విక్రమ్' సినిమా చేశారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 3వ తేదీన వివిధ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. 

దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో కమల్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మాట్లాడుతూ, "ఈ సినిమా కంటెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సాధారణంగా ప్రతి మనిషిలోను మరో మనిషి ఉంటాడు. అవసరాన్ని బట్టి ఆ రెండో వ్యక్తి బయటికి వస్తుంటాడు. అప్పటివరకూ అసలు మనిషిని తనలోనే దాచుకుని అంతా తిరుగుతుంటారు.

అలాగే ఈ సినిమాలోను ప్రతి మనిషిలో మరో మనిషి ఉంటాడు .. అసలు మనిషి ఎలాంటి పరిస్థితుల్లో బయటికి వస్తాడు? అని నిరూపించే విధంగా ఈ కథ నడుస్తుంది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఈ  పాత్రలను చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు. ఆయన గత చిత్రాలకి మించి ఈ సినిమా మంచి పేరును తీసుకుని వస్తుంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News