YSRCP: వైసీపీ నుంచి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు బ‌హిష్క‌ర‌ణ‌

  • 2024 ఎన్నిక‌ల‌పై మంగ‌ళ‌వారం కొత్త‌ప‌ల్లి కీల‌క ప్ర‌క‌ట‌న‌
  • ఆ ప్ర‌క‌ట‌న పార్టీ నిబంధ‌నావ‌ళికి వ్య‌తిరేక‌మ‌ని వైసీపీ నిర్ధార‌ణ‌
  • పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌కు క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ నివేదిక‌
  • కొత్త‌ప‌ల్లిని పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌
ys jagan expels kottapalli subbarayudu from ysrcp

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా విజ‌యం సాధించిన సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌, మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడిపై వైసీపీ బ‌హిష్క‌ర‌ణ వేటు వేసింది. ఈ మేర‌కు వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుధ‌వారం ప్ర‌క‌టించారు.

2024 ఎన్నిక‌ల్లో తాను న‌ర‌సాపురం నుంచి త‌ప్ప‌నిస‌రిగా పోటీ చేస్తాన‌ని మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించిన కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు... త‌న‌కు నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా వ్య‌క్తిగ‌త ఓటింగ్ ఉంద‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా 2024 ఎన్నికల్లో ఏ పార్టీ త‌ర‌ఫున తాను పోటీ చేస్తాన‌న్న విష‌యాన్ని మాత్రం చెప్ప‌బోనంటూ కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. 

ఈ క్ర‌మంలో కొత్త‌ప‌ల్లి పార్టీ నిబంధ‌నావ‌ళిని అతిక్ర‌మించార‌ని పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ జ‌గ‌న్‌కు నివేదించింది. ఈ నివేదిక‌ను ఆధారం చేసుకునే కొత్త‌ప‌ల్లిని పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

More Telugu News