AAP: ఆప్ మంత్రి స‌త్యేంద్ర జైన్ అరెస్ట్‌పై కేజ్రీవాల్ స్పంద‌న ఇదే

  • ఆ కేసు ముమ్మాటికి త‌ప్పుడు కేసేనన్న కేజ్రీవాల్ 
  • అవినీతిని దేశ ద్రోహిగా భావిస్తామని వ్యాఖ్య 
  • అవినీతికి పాల్ప‌డ్డ పంజాబ్ మంత్రిని జైలుకు పంపామని వెల్లడి 
  • ఇలాంటిది ఎక్కడైనా చూశారా? అన్న కేజ్రీవాల్‌
aap convener and delhi cm arvind kejrivas comments on satyendar jain arrest

హ‌వాలా లావాదేవీల ఆరోప‌ణ‌ల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసిన ఆప్ నేత‌, డిల్లీ కేబినెట్ మంత్రి స‌త్యేంద్ర జైన్‌పై ఆ పార్టీ జాతీయ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తాజాగా స్పందించారు. స‌త్యేంద్ర జైన్‌పై న‌మోదైన కేసు త‌ప్పుడు కేస‌ని కేజ్రీవాల్ అన్నారు. తాము నిజాయ‌తీ గ‌ల నేత‌ల‌మ‌ని కూడా ఆయ‌న చెప్పారు. అవినీతిని తాము దేశ ద్రోహిగా ప‌రిగ‌ణిస్తామ‌ని తెలిపారు. అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో పంజాబ్‌లోని త‌మ పార్టీ ప్రభుత్వం ఓ మంత్రినే జైలుకు పంపిందని తెలిపారు. ఇంత‌టి నిజాయ‌తీ దేశంలోనే కాదు ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా క‌నిపించ‌ద‌ని కూడా కేజ్రీవాల్ పేర్కొన్నారు.

కోల్ క‌తా కంపెనీతో హ‌వాలా లావాదేవీలు నిర్వ‌హించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై స‌త్యేంద్ర జైన్‌ను ఈడీ అధికారులు సోమ‌వారం అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మంగ‌ళ‌వారం ఆయ‌న‌ను కోర్టులో హాజ‌రుప‌ర‌చిన ఈడీ... ఆయ‌న‌ను త‌మ క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌న్‌పై అప్ప‌టిక‌ప్పుడే విచార‌ణ చేప‌ట్టిన కోర్టు... ఈడీ వాద‌న‌తో ఏకీభ‌విస్తూ స‌త్యేంద్ర జైన్‌ను జూన్ 9 వ‌ర‌కు ఈడీ క‌స్ట‌డీకి అనుమ‌తించింది.

More Telugu News