Venkatesh Daggubati: 'ఎఫ్ 3' నాలుగు రోజుల వసూళ్లు ఇవే!

  • ఈ నెల 27వ తేదీన విడుదలైన 'ఎఫ్ 3'
  • భారీతారాగణంతో సందడి చేయించిన అనిల్ రావిపూడి
  • అదనపు ఆకర్షణగా సోనాల్ - పూజ హెగ్డేలను రంగంలోకి దించిన తీరు    
  • నాలుగు రోజుల్లో 32.11 కోట్ల వసూళ్లు
F3 Movie Update

వెంకటేశ్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 3' సినిమా రూపొందింది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 4 రోజులలో మంచి వసూళ్లను సాధించింది. సాధారణంగా ఏ సినిమా అయినా వీకెండ్ తరువాత నిలబడితే మేకర్స్ తేలికగా ఊపిరి పీల్చుకుంటారు. 

ఈ సినిమా సోమవారం కూడా మంచి వసూళ్లను రాబట్టడం పట్ల మేకర్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిన్న ఒక్క రోజునే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 4.64 కోట్లను వసూలు చేసింది. ఈ 4 రోజుల మొత్తంగా చూసుకుంటే 32.11 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఓవర్సీస్ విషయానికి వస్తే 2.3 మిలియన్ వసూళ్లను సాధించింది.

  'ఎఫ్ 2' ను మించి 'ఎఫ్ 3' ఉండాలనే ఉద్దేశంతో, ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి మరింతమంది ఆర్టిస్టులను తీసుకున్నాడు. కామెడీ వైపు నుంచి సునీల్ .. అలీని కొత్తగా తీసుకున్నాడు. ఇక గ్లామర్ వైపు నుంచి సోనాల్ చౌహాన్ ... పూజ హెగ్డేను తీసుకున్నాడు. తాము అనుకున్నట్టుగానే ఈ సినిమా నవ్వుల సందడి చేస్తున్నందుకు హ్యాపీగా ఉందంటూ ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్లో చెప్పిన సంగతి తెలిసిందే.

More Telugu News