Sensex: మార్కెట్ల మూడు రోజుల లాభాలకు బ్రేక్!

  • భయపెడుతున్న జర్మనీ ద్రవ్యోల్బణం పెరుగుదల
  • 359 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 76 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్ల మూడు రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. నిన్న భారీ లాభాలను మూటకట్టుకున్న మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. జర్మనీలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పాటు, అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. 

ఈ నేపథ్యంలో, ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 359 పాయింట్లు నష్టపోయి 55,566కి పడిపోయింది. నిఫ్టీ 76 పాయింట్లు కోల్పోయి 16,584 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (4.51%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.62%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.99%), టెక్ మహీంద్రా (1.89%), టైటాన్ (1.24%).

టాప్ లూజర్స్:
కోటక్ బ్యాంక్ (-3.55%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.98%), సన్ ఫార్మా (-2.77%), రిలయన్స్ (-1.53%), ఇన్ఫోసిస్ (-1.39%).

More Telugu News