Sidhu Moosewala: భక్తుల చాటున నక్కిన సిద్ధూ మూసేవాలా హత్య కేసు అనుమానితుడు... పట్టుకున్న పోలీసులు

  • నిన్న పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య
  • కారులో వెళుతుండగా కాల్చి చంపిన దుండగులు
  • నిందితుల కోసం తీవ్ర గాలింపు
  • ఉత్తరాఖండ్ లో ఆరుగురు అనుమానితుల అరెస్ట్
  • హత్యకు తమదే బాధ్యత అంటున్న బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు
  • తీహార్ జైల్లో తనిఖీలు
Police arrest suspect in Sidhu Moosewala murder case

పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత శుభదీప్ సింగ్ అలియాస్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితుల కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. సిద్ధూ మూసేవాలా హత్యలో పాల్గొన్నాడని భావిస్తున్న ఓ అనుమానితుడ్ని పోలీసులు ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో అదుపులోకి తీసుకున్నారు. 

ఇక్కడి పర్వత సానువుల్లో హేమకుండ్ సాహిబ్ పవిత్ర యాత్ర నిర్వహిస్తుండగా, ఆ యాత్రలో పాల్గొన్న భక్తుల చాటున ఆ అనుమానితుడు దాక్కున్నప్పటికీ అతడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ జాయింట్ ఆపరేషన్ లో పంజాబ్, ఉత్తరాఖండ్ పోలీసులు పాల్గొన్నారు. 

మరోపక్క, సిద్ధూ మూసేవాలాను హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందినవాళ్లు ప్రకటించుకున్నారు. ఇప్పుడు డెహ్రాడూన్ లో పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందినవాడిగా భావిస్తున్నారు. కాగా, మరో ఐదుగురు అనుమానితులను కూడా ఉత్తరాఖండ్ లో అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ పంజాబ్ కు తీసుకువస్తున్నారు. 

ఇదిలావుంచితే, మూసేవాలా హత్యకు తమదే బాధ్యత అని బిష్ణోయ్ గాంగ్ పేర్కొన్న నేపథ్యంలో, తీహార్ జైల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ తీహార్ జైల్లోనే ఉన్నాడు. అయితే, జైల్లో ఉంటూ ఇంత పెద్ద హత్యకు ఎలా కుట్ర పన్నగలడంటూ బిష్ణోయ్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు.

More Telugu News