Venkatesh Daggubati: ఫ్యామిలీ ఆడియన్స్ ను 'ఎఫ్ 3' థియేటర్స్ కి రప్పించేసింది: వెంకటేశ్

  • 'ఎఫ్ 3' సక్సెస్ సెలబ్రేషన్స్ లో వెంకటేశ్ 
  • కొంత గ్యాప్ తరువాత తన సినిమా థియేటర్స్ కి వచ్చిందంటూ వ్యాఖ్య 
  • తన అభిమానుల కోరిక ఫలించిందంటూ హర్షం
  • సక్సెస్ కి కారణం టీమ్ వర్క్ అంటూ స్పష్టీకరణ
F3 movie Block Buster Fun Ride Celabrations

వెంకటేశ్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా రూపొందిన 'ఎఫ్ 3' సినిమా ఈ నెల 27వ తేదీన విడుదలైంది. తమన్నా .. మెహ్రీన్ తో పాటు సోనాల్ చౌహాన్ .. పూజ హెగ్డే అందాల సందడి చేశారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరిపారు. 

ఈ స్టేజ్ పై వెంకటేశ్ మాట్లాడుతూ .. " ఈ సినిమా అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ సినిమా సక్సెస్ కి కారణం టీమ్ వర్క్. ప్రతి ఒక్కరూ కూడా ఇది తమ సొంత సినిమా అన్నట్టుగా చాలా అంకితభావంతో పనిచేశారు. చాలా కాలంగా థియేటర్స్ కి రావడం తగ్గించేసిన ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా థియేటర్స్ కి రప్పించింది. వాళ్లంతా రావడం వల్లనే ఈ సినిమా బ్లాక్ బస్టర్  హిట్ అయింది. 

నా సినిమా థియేటర్స్ కి రాక రెండు మూడేళ్లు అవుతోంది. అందువలన నా ఫ్యాన్స్ చాలా ఓపికగా ఎదురుచూశారు. వాళ్లు ఆశించిన రిజల్ట్ వచ్చినందుకు అందరూ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలోను .. ఈ విజయంలోను భాగమైన ప్రతి ఒక్కరికీ, అలాగే ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు" అంటూ ముగించారు.

More Telugu News