TDP Mahanadu: మ‌హానాడుకు పోటెత్తిన జ‌నం... బ‌హిరంగ స‌భ‌కు ఎంత మంది వ‌చ్చారంటే?

  • మూడేళ్ల త‌ర్వాత జ‌రిగిన టీడీపీ మ‌హానాడు
  • బ‌హిరంగ స‌భ‌కు 1.5 ల‌క్ష‌ల మంది వ‌స్తార‌ని టీడీపీ అంచ‌నా
  • అంత‌కు రెట్టింపుగా 3ల‌క్ష‌ల మంది హాజరు
  • ప‌సుపు మ‌యంగా మారిన మండువ‌వారిపాలెం
3 lacks tdp cadre attended to mahanadu public meeting

ఒంగోలు స‌మీపంలోని మండువ‌వారిపాలెం కేంద్రంగా జ‌రిగిన టీడీపీ మ‌హానాడుకు ఆ పార్టీ శ్రేణులు పోటెత్తారు. రెండు రోజుల పాటు నిర్వ‌హించిన మ‌హానాడులో భాగంగా శ‌నివారం బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌కు తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీ శ్రేణులు, టీడీపీ అభిమానులు భారీ ఎత్తున త‌ర‌లివచ్చారు. క‌రోనా నేప‌థ్యంలో గ‌డ‌చిన రెండేళ్లుగా మ‌హానాడు జూమ్ ద్వారానే జ‌ర‌గ‌డం, మూడేళ్ల త‌ర్వాత తొలి మ‌హానాడు కావ‌డం, పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌ల నేప‌థ్యంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా వేడుక‌కు హాజ‌ర‌య్యారు. షెడ్యూల్ ప్ర‌కారం శ‌నివారం సాయంత్రం 3 గంట‌ల‌కు మ‌హానాడు బ‌హిరంగ స‌భ ప్రారంభం కావాల్సి ఉండ‌గా... ఉద‌యం 7 గంట‌ల నుంచే స‌భా ప్రాంగ‌ణంలో పార్టీ శ్రేణుల సంద‌డి క‌నిపించింది.

ఏపీ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా మ‌హానాడు బ‌హిరంగ స‌భ‌కు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు త‌ర‌లివ‌చ్చాయి. బ‌హిరంగ స‌భ‌కు దాదాపుగా 1.50 ల‌క్ష‌ల మంది హాజ‌రు అవుతార‌ని టీడీపీ అధిష్ఠానం భావించింది. అయితే ఆ అంచ‌నాల‌ను మించి ఏకంగా 3 ల‌క్ష‌ల మంది పార్టీ శ్రేణులు బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రు కావడం గ‌మ‌నార్హం. రెండు రాష్ట్రాల నుంచి పార్టీ శ్రేణులు కార్లు, మినీ బ‌స్సులు, ట్రాక్ట‌ర్లు, ఆటోల్లో త‌ర‌లివ‌చ్చారు. ఫ‌లితంగా పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థ‌లం వాహ‌నాల‌తో నిండిపోయింది. ఇంకా వంద‌లాది వాహ‌నాలు రోడ్ల‌పైనే నిలిచిపోవాల్సి వ‌చ్చింది. బ‌హిరంగ స‌భ‌కు అంచ‌నాల‌కు మించి పార్టీ శ్రేణులు హాజ‌రుకావ‌డంతో పార్టీ నేత‌లు కూడా ఉత్సాహంగా ప్ర‌సంగించారు. నేత‌ల ప్ర‌సంగాల‌కు పార్టీ శ్రేణుల నుంచి భారీ స్పంద‌న ల‌భించింది. మొత్తంగా మూడేళ్ల త‌ర్వాత నిర్వ‌హించిన మ‌హానాడు గ్రాండ్ స‌క్పెస్‌గా ముగిసింది.

More Telugu News