Andhra Pradesh: జూన్ 10లోపు ఏపీ ‘పది’ ఫలితాలు.. బొత్స సమయం ఇచ్చిన వెంటనే విడుదల!

  • పూర్తయిన మూల్యాంకన ప్రక్రియ
  • జులై రెండో వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
  • జూన్ చివరి వారంలో ఇంటర్ ఫలితాలు
  • ఆగస్టులో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
AP Education ministry to release 10th results on before june 10th

మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావడంతో పదో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్ణయించింది. మంత్రి బొత్స సత్యనారాయణ ఇచ్చే సమయాన్ని బట్టి జూన్ 8-10 తేదీల మధ్య ఫలితాలను విడుదల చేయాలని యోచిస్తోంది. అలాగే, ఆ తర్వాతి నెలలో అంటే జులై రెండో వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. 

ఇంటర్ ఫలితాలను మాత్రం జూన్ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీకి, ఫలితాలకు మధ్య కనీసం నెల రోజుల సమయం ఉండాలి కాబట్టి వాటిని ఆగస్టులో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్టు సమాచారం.

More Telugu News