Geetanjali Shree: బుకర్ ప్రైజ్ తో చరిత్ర సృష్టించిన గీతాంజలి శ్రీ

  • టూంబ్‌ ఆఫ్ శాండ్ ను ఎంపిక చేసిన బుకర్ ప్రైజ్ కమిటీ
  • భారతీయ భాషల నుంచి అవార్డు గెలుచుకున్న తొలి పుస్తకం
  • అమెరికా ట్రాన్స్ లేటర్ డైసీ రాక్ వెల్ తో సంయుక్తంగా అవార్డుకు ఎంపిక
Geetanjali Shree becomes first Hindi author to win International Booker Prize

ప్రముఖ హిందీ నవలా రచయిత గీతాంజలి శ్రీ ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ ను గెలుచుకుని చరిత్ర సృష్టించారు. సాహిత్యంలో అత్యుత్తమ నవలను ఎంపిక చేసి ఈ ప్రైజ్ ఏటా ప్రకటిస్తుంటారు. ‘టూంబ్‌ ఆఫ్ శాండ్’ పేరుతో గీతాంజలి శ్రీ రచించిన నవలను ఈ ఏడాదికి గాను బుకర్ ప్రైజ్ వరించింది. భారతీయ భాషలలో అవార్డు గెలుచుకున్న మొదటి పుస్తకంగా ఇది రికార్డు నమోదు చేసింది. ఈ హిందీ నవలను ఇంగ్లిష్ లోకి అనువదించిన అమెరికా ట్రాన్స్ లేటర్ డైసీ రాక్ వెల్ తో సంయుక్తంగా బుకర్ ప్రైజ్ ను గీతాంజలి శ్రీ గెలుచుకున్నారు.

 టూంబ్‌ ఆఫ్ శాండ్ పుస్తకాన్ని ‘బలమైన వాదాన్ని వినిపించే ఎదురేలేని నవల’గా అవార్డు న్యాయ నిర్ణేతలు అభివర్ణించారు. అవార్డుతో పాటు 50,000 పౌండ్లను విజేతలకు అందిస్తారు. ఉత్తరప్రదేశ్ మెయిన్ పురిలో జన్మించి, ఢిల్లీలో పెరిగిన గీతాంజలిశ్రీ (64) మూడు నవలలు, పలు కథలను ఇప్పటి వరకు రాశారు. బ్రిటన్ లో పబ్లిష్ అవుతున్న ఆమె తొలి పుస్తకం టూంబ్‌ ఆఫ్ శాండ్. 2000లో మాయ్ అనే పుస్తకం రాయగా, ఇది క్రాస్ వర్డ్ బుక్ అవార్డుకు ఎంపికైంది. గతంలో పలు అవార్డులు సైతం ఆమెను వరించాయి. 

 టూంబ్‌ ఆఫ్ శాండ్ 2018లో హిందీలో ప్రచురితమైంది. అంటే బుకర్ ప్రైజ్ కు ఎంపికైన తొలి హిందీ పుస్తకం ఇదే కానుంది. ఈ పుస్తకానికి హిందీలో ‘రేత్ సమాధి’ పేరు. భారతదేశ విభజన నీడలో సాగే ఓ కుటుంబం కథను నవల ఇతి వృత్తంగా రచయిత తీసుకున్నారు.

More Telugu News