SKOCH: ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు

  • రాష్ట్రానికి మరో స్కోచ్ అవార్డు
  • గ్రామీణాభివృద్ధి శాఖకు స్టార్ ఆఫ్ గవర్నెన్స్ పురస్కారం
  • వచ్చే నెల 18న అవార్డు ప్రదానం
  • హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు
SKOCH award for AP Rural Development department

ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్కోచ్ 'స్టార్ ఆఫ్ గవర్నెన్స్' అవార్డుకు ఎంపికైంది. జూన్ 18న ఢిల్లీలో జరిగే ఇండియన్ గవర్నెన్స్ ఫోరం వేదికగా ఈ అవార్డు ప్రదానం చేస్తారు.  

  గ్రామీణాభివృద్ధి శాఖకు స్కోచ్ అవార్డు లభించడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ గ్రామీణ పాలనలో అనుసరిస్తున్న విప్లవాత్మక విధానాలు, సంస్కరణల వల్లే రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. పారదర్శకత, ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు... ఇలా అనేక పథకాలతో సీఎం జగన్ పాలన అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు.

More Telugu News