Shashi Tharoor: బుక్ స్టోర్ కు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సూచించిన అద్భుత పేరు!

  • అసోమ్ కు చెందిన ఓ వ్యక్తి విన్నపం
  • తన స్నేహితుడి బుక్ స్టోర్ కు పేరు సూచించాలంటూ ట్వీట్
  • ‘WWW: వరల్డ్ వైడ్ వర్డ్స్’ను సూచించిన థరూర్
Man asks Shashi Tharoor to help him with a name for a bookstore Congress MP reply impresses Internet

కాంగ్రెస్ పార్టీ తిరువనంతపురం ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ తరచుగా కొత్త ఇంగ్లిష్ పదాలను పరిచయం చేస్తుంటారు. వీటి కోసమే ఆయన్ను ట్విట్టర్ లో ఫాలో అయ్యేవారు బోలెడుమంది ఉన్నారు. ఆయన్ను అనుసరించే అసోంకు చెందిన షాజహాన్ అనే వ్యక్తి తన ఫ్రెండ్ కొత్తగా ప్రారంభించే బుక్ స్టోర్ కు మంచి పేరు సూచించాలంటూ శశిథరూర్ ను కోరాడు. 

‘‘డియర్ శశి థరూర్ సర్, నా ఆప్త స్నేహితుడు ఎంఫిల్ పూర్తి అయిన తర్వాత మజూలీలో షాప్ తెరవాలని అనుకుంటున్నాడు. ఇందులో నెట్ కేఫ్, బుక్స్, స్టేషనరీ ఐటమ్స్ విక్రయాలు ఉంటాయి. తన షాపు కోసం ఇంగ్లిష్ లో ఒక వినూత్నమైన పేరు సూచించాలని అడుగుతున్నాడు. పేరుకు సంబంధించి అన్వేషణలో సాయం చేయగలరని ప్రార్థన’’ అంటూ షాజహాన్ ట్వీట్ లో పేర్కొన్నాడు.

దీనికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. ‘‘WWW: వరల్డ్ వైడ్ వర్డ్స్’? అని పిలవడం ఎలా ఉంది? ఇది పుస్తకాలతోపాటు ఇంటర్నెట్ ను కూడా కవర్ చేస్తుంది. అని థరూర్ ట్వీట్ చేశారు. థరూర్ ఇచ్చిన సూచనను ఎంతో మంది మెచ్చుకుంటున్నారు. వినూత్నమైన పేరును సూచించినందుకు షాజహాన్ కూడా ధన్యవాదాలు తెలియజేశాడు. షాపుకు అదే పేరు పెడతామని ప్రకటించాడు.

More Telugu News