Venkatesh Daggubati: సోనాల్ చౌహాన్ పాత్ర గురించి మాత్రం అడగొద్దు: అనిల్ రావిపూడి

  • 'ఎఫ్ 2' సీక్వెల్ గా వస్తున్న 'ఎఫ్ 3' 
  • కీలకమైన పాత్రను పోషించిన సోనాల్ చౌహాన్
  • ఆ పాత్రను రివీల్ చేయనని చెప్పిన అనిల్ రావిపూడి 
  • 'ఎఫ్ 4' ఉంటుందంటూ ఇచ్చిన క్లారిటీ
F3 movie update

అనిల్ రావిపూడికి కామెడీపై ఎంత పట్టు ఉందనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన గత చిత్రాలు చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 3' సినిమా ఈ నెల 27వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.

తాజాగా ఈ సినిమా టీమ్ ను బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేశాడు. ఆయన అడిగిన ప్రశ్నకి అనిల్ రావిపూడి స్పందిస్తూ .. " తమన్నా .. మెహ్రీన్ లాంటి బ్యూటీస్ ఉన్నప్పటికీ సోనాల్ ను ఎందుకు పెట్టామనే విషయం మాత్రం అడగొద్దు. ఆమె పాత్రకి సంబంధించినంతవరకూ ఒక సర్ ప్రైజ్ ఉంది. అందువలన ఆ విషయాలను రివీల్ చేయదలచుకోలేదు. 

ఇక పూజ హెగ్డే సాంగ్ తప్పకుండా ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. 'ఫలక్ నుమా ప్యాలెస్'లో ఎక్కువ రోజులు షూటింగు జరుపుకున్న సినిమా మాదే. ఈ సినిమాలోనూ నేను చివర్లో కనిపిస్తాను. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మేము ఆశించే రెస్పాన్స్ ఉంటే, 'ఎఫ్  4' తప్పకుండా ఉంటుంది. ప్రధానమైన తారాగణం ఇదే ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.  

More Telugu News