KTR: తెలంగాణ‌కు లులూ గ్రూప్‌... రూ.500 కోట్ల‌ పెట్టుబ‌డి పెట్ట‌నున్న సంస్థ‌

  • దావోస్‌లో లులూ గ్రూప్ సీఎండీతో కేటీఆర్ భేటీ
  • తెలంగాణ‌లో రూ.500 కోట్ల పెట్టుబ‌డికి లులూ అంగీకారం
  • తెలంగాణ ప్ర‌భుత్వం, లులూ మ‌ధ్య కుదిరిన ఒప్పందం
lulu group will invest 500 crores in telangana

దావోస్ వేదిక‌గా ఆదివారం వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సు ప్రారంభం కాగా... రెండో రోజైన సోమ‌వార‌మే తెలంగాణ బృందం స‌త్తా చాటింది. ఇప్ప‌టికే స్విస్ రే, మీషో సంస్థ‌ల‌తో ఒప్పందాలు కుదుర్చుకున్న తెలంగాణ ప్ర‌భుత్వం... తాజాగా రిటైల్ రంగంలో అంత‌ర్జాతీయంగా స‌త్తా చాటుతున్న లులూ గ్రూప్‌తోనూ ఒప్పందం చేసుకుంది. ఈ మేర‌కు దావోస్‌లో సోమ‌వారం తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో లులూ సంస్థ‌తో రాష్ట్ర అధికారులు ఒప్పందం కుదు‌ర్చుకున్నారు. 

హైప‌ర్ మార్కెట్లు, మ‌ల్టీ ప్లెక్స్‌ల నిర్మాణంలో దిగ్గ‌జ కంపెనీగా పేరుగాంచిన లులూ గ్రూప్ యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ రాజ‌ధాని అబూ దాబి కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. దావోస్ స‌ద‌స్సులో తెలంగాణ పెవిలియ‌న్ కు వ‌చ్చిన ఆ సంస్థ సీఎండీ ఎంఏ యూసుఫ్ అలీ తెలంగాణ బృందంతో భేటీ అయ్యారు. చ‌ర్చ‌ల అనంత‌రం ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఒప్పందం కుద‌ర‌గా... ఈ ఒప్పందం ప్ర‌కారం తెలంగాణ‌లో లులూ గ్రూప్ రూ.500 కోట్ల పెట్టుబ‌డిని పెట్ట‌నుంది.

More Telugu News