Telangana: దావోస్‌లో ఆక‌ట్టుకుంటున్న‌ తెలంగాణ పెవిలియ‌న్!... వీడియో ఇదిగో!

  • దావోస్‌లో తెలంగాణ బృందానికి కేటీఆర్ నేతృత్వం
  • తెలంగాణ పెవిలియ‌న్ గ్లింప్సెస్ పేరిట వీడియో విడుద‌ల‌
  • ఫ‌స్ట్ స్టాప్ తెలంగాణ అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
this is the Telangana Pavilion glimpses video at davos

ప్ర‌పంచ వాణిజ్య విప‌ణిలో స‌రికొత్త ప్ర‌ణాళిక‌లు, స‌రికొత్త ప్రారంభాల‌కు నెల‌వుగా మారిన దావోస్ స‌ద‌స్సులో తెలంగాణ స‌ర్కారు ఏర్పాటు చేసిన పెవిలియ‌న్ ఆక‌ట్టుకుంటోంది. ఇండియా వెల్‌క‌మ్స్ ద వ‌ల‌ర్డ్‌... ఫ‌స్ట్ స్టాప్ తెలంగాణ అన్న నినాదంతో ఈ పెవిలియ‌న్‌ను రూపొందించారు.

 తెలంగాణ పారిశ్రామిక విధానం విస్ప‌ష్టంగా క‌నిపించేలా రూపొందించిన ఈ పెవిలియ‌న్‌లో హైద‌రాబాద్‌కు ప్ర‌త్యేక స్థానాన్ని ఇచ్చారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం దావోస్ స‌ద‌స్సులో తెలంగాణ పెవిలియ‌న్ గ్లింప్సెస్ పేరిట మంత్రి కేటీఆర్ కార్యాల‌యం ఓ వీడియోతో పాటు ప‌లు ఫొటోల‌ను విడుద‌ల చేసింది.

దావోస్ స‌ద‌స్సుకు హాజ‌రైన తెలంగాణ బృందానికి మంత్రి కేటీఆర్ నేతృత్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. 29 సెక‌న్ల నిడివి ఉన్న గ్లింప్సెస్ వీడియోలో కేటీఆర్ కూడా క‌నిపిస్తున్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ అంటూ సాగే ఈ వీడియోలో స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దిన‌ తెలంగాణ పెవిలియ‌న్ ముఖద్వారం, ఆయా కంపెనీల ప్ర‌తినిధుల‌తో భేటీల కోసం చేసిన ఏర్పాట్ల‌ను పొందుప‌రిచారు.

More Telugu News