Saudi Arabia: భారత్ లో ప్రయాణించకుండా సౌదీ వాసులపై ఆంక్షలు

  • కరోనా కేసుల పెరుగుదల వల్లేనని ప్రకటన
  • మరో 15 దేశాలకు వెళ్లడంపైనా ఆంక్షలు
  • సౌదీకి భారతీయులు వెళ్లడంపై లేని స్పష్టత  
Saudi citizens banned from travelling to India 15 other nations amid Covid surge

సౌదీ జాతీయులు భారత్ లో ప్రయాణించకుండా అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మరో 15 దేశాల్లోనూ ప్రయాణించకుండా ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది. లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, కాంగో, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, ఆర్మీనియా, బెలారస్, వెనెజులా ఉన్నాయి.

ఆయా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పాస్ పోర్ట్స్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ దేశాలకు వెళ్లేందుకు సౌదీ అరేబియా పౌరులను అక్కడి ప్రభుత్వం అనుమతించదు. అయితే, సౌదీకి భారతీయులు రావడంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి మన దేశంలో కరోనా కేసులలో పెరుగుదల ఏమీ లేదు. అవి దాదాపు కనిష్ఠ స్థాయుల్లోనే కొనసాగుతున్నాయి. అస్పష్ట సమాచారం, అవగాహన లోపంతో సౌదీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News