Buses: రైలెక్కిన బస్సులు... వీడియో ఇదిగో!

  • గూడ్స్ రైళ్లలో బస్సుల రవాణా
  • బెంగళూరు నుంచి చండీగఢ్ కు 300 బస్సుల తరలింపు
  • అశోక్ లేలాండ్ ప్లాంట్లలో తయారైన బస్సులు
  • బస్సులను కొనుగోలు చేసిన హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీ
  • రైల్లో చవకగా రవాణా
Buses transports through goods trains

సాధారణంగా గూడ్స్ రైళ్లలో బైకులు, ట్రాక్టర్లు తరలించడం చూస్తుంటాం అప్పుడప్పుడు.  అయితే దేశంలో తొలిసారిగా ఆర్టీసీ బస్సులను గూడ్స్ రైలులో రవాణా చేశారు. బెంగళూరు నుంచి చండీగఢ్ కు ఈ బస్సులను తరలించారు. ఈ బస్సులు హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందినవి. మొత్తం 300 బస్సులను రైలు మార్గం ద్వారా రవాణా చేశారు. 

ఈ బస్సులు బెంగళూరు, హోసూరులోని అశోక్ లేలాండ్ యూనిట్లలో తయారయ్యాయి. వీటిని రోడ్డు మార్గంలో తరలించాలంటే ఎంతో వ్యయం అవుతుంది. దేశంలో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, రైలు మార్గం ద్వారా చాలా చవకగా రవాణా చేయవచ్చని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన వందలాది బస్సులను రైల్లో తరలించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ లో పంచుకున్నారు.

More Telugu News