Polavaram Project: పోల‌వ‌రంలో స్పిల్‌వే నిర్మాణం పూర్తి... వివరాలు వెల్ల‌డిస్తూ మేఘా ట్వీట్‌

  • 48 రేడియ‌ల్ గేట్ల ఏర్పాటు పూర్తి
  • పూర్తి అయిన‌ 98 హైడ్రాలిక్ సిలిండ‌ర్ల బిగింపు
  • గేట్లను ఎత్తేందుకు 24 ప‌వ‌ర్ ప్యాక్‌ల‌ను ఏర్పాటు చేశామ‌న్న మేఘా
MEIL completed the spillway construction in the Polavaram irrigation project

ఏపీ జీవ‌నాడిగా ప‌రిగ‌ణిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టులో కీల‌క స్పిల్ వే నిర్మాణం పూర్తయింది. ఈ మేర‌కు శ‌నివారం ఆ ప్రాజెక్టు ప‌నుల‌ను చేప‌డుతున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. స్పిల్‌వేలో 48 రేడియ‌ల్ గేట్ల నిర్మాణం పూర్తి అయ్యింద‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. 

అదే స‌మ‌యంలో 98 హైడ్రాలిక్ సిలిండ‌ర్ల‌ను కూడా ఏర్పాటు చేసినట్లు మేఘా తెలిపింది. రేడియ‌ల్ గేట్ల‌ను ఎత్తేందుకు 24 ప‌వ‌ర్ ప్యాక్‌ల‌ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు ఆ సంస్థ వివ‌రించింది.

More Telugu News