YSRCP: కియా పేరుతో అనంత రైతులను ముంచింది చంద్రబాబే: మాజీ మంత్రి శంక‌ర‌నారాయ‌ణ‌

  • కియా ప్లాంట్ కోసం 900 ఎక‌రాలు సేక‌రించారన్న మాజీ మంత్రి 
  • రైతుల‌కు ఎక‌రానికి రూ.9–10 లక్షలిచ్చారని వ్యాఖ్య 
  • భూమి చదును పేరిట‌ ఎకరాకు రూ.30 లక్షలు ఖర్చు చూపించారని విమర్శ 
  • రూ.500 కోట్ల కుంభ‌కోణం నిజ‌మా?, కాదా? అన్న శంక‌ర‌నారాయ‌ణ‌
apex minister shankara narayana allegations on tdp chief chandrababu

అనంత‌పురం జిల్లాలో ఏర్పాటైన‌ కొరియా కార్ల కంపెనీ కియా ప్లాంట్‌ను ప్ర‌స్తావిస్తూ టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంక‌రనారాయ‌ణ కీల‌క ఆరోప‌ణ‌లు గుప్పించారు. కియా కార్ల కంపెనీ పేరుతో అనంత‌పురం జిల్లా రైతులను ముంచింది చంద్ర‌బాబేనంటూ ఆయ‌న ఆరోపించారు. ఈ మేర‌కు నేడు పెనుకొండ‌లో మీడియాతో మాజీ మంత్రి మాట్లాడుతూ... చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు, వ్యాఖ్య‌లు గ‌తి త‌ప్పుతున్నాయ‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు ఆయ‌న వ‌య‌సుకు త‌గ్గ‌ట్టుగా లేవ‌ని కూడా ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

కియా కార్ల కంపెనీ కోసం రైతుల నుంచి కారు చౌక‌గా భూములు సేక‌రించిన నాటి టీడీపీ ప్ర‌భుత్వం రూ.500 కోట్ల మేర కుంభ‌కోణానికి పాల్ప‌డింద‌ని ఆరోపించారు. నిజానికి ఆనాడు కియా కంపెనీ పేరుతో రైతుల నుంచి ఒక్కో ఎకరా భూమి రూ.9–10 లక్షలకు కొట్టేసి, దాదాపు రూ.500 కోట్ల కుంభకోణానికి పాల్ప‌డ్డార‌న్నారు. కియా కంపెనీ కోసం అంటూ 900 ఎకరాలు సేకరించి, ఆ భూమి చదును చేసినందుకు ఒక్కో ఎకరాకు రూ.30 లక్షలు వ్యయం చేసినట్లు చెప్పారన్నారు. ఆ విధంగా దాదాపు రూ.500 కోట్ల కుంభకోణం చేసిన మాట వాస్తవమా? కాదా? ఆని ఆయ‌న ప్ర‌శ్నించారు.

More Telugu News