Stalin: స్టాలిన్ ఇంటిని బాంబులతో పేల్చి వేస్తామంటూ బెదిరింపులు!

  • బుధవారంనాడు బెదిరింపు కాల్స్ చేసిన తిరునల్వేలి జిల్లాకు చెందిన వ్యక్తి
  • సైబర్ క్రైమ్ విభాగం సాయంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • గంజాయి మత్తులో ఫోన్ చేసినట్టు విచారణలో తేలిన వైనం
Bomb threat call to CM Stalin residence

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటిని బాంబులతో పేల్చివేస్తామంటూ వచ్చిన బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ఎగ్మూర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ అజ్ఞాత వ్యక్తి బుధవారంనాడు ఈ బెదిరింపు కాల్స్ చేశాడు. స్టాలిన్ ఇంటి వద్ద బాంబులు పెట్టామని, కాసేపట్లో అవి పేలనున్నాయని, చేతనైతే అడ్డుకోవాలని అతను పోలీసులకు సవాల్ విసిరాడు. ఈ ఫోన్ కాల్ తో పోలీసు అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. హుటాహుటిన బాంబ్ స్క్వాడ్ తో ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయాలకు వెళ్లి తనిఖీలు చేశారు. ఆ తర్వాత అది ఫేక్ కాల్ అని నిర్ధారించుకున్నారు. 

ఆ తర్వాత ఫోన్ చేసిన ఆగంతుకుడు ఎవరనే విషయంపై దృష్టి సారించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ విభాగంతో కలసి నిందితుడిని పోలీసులు గుర్తించారు. తిరునల్వేలి జిల్లా సుద్దమిల్లి గ్రామానికి చెందిన తామరైకన్నన్ ఈ ఫోన్ చేసినట్టు నిర్ధారించి, అరెస్ట్ చేశారు. గంజాయి మత్తులో అతను ఈ ఫోన్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.

More Telugu News