YSRCP: ఏపీలో ప‌శువుల‌కూ సంచార వైద్యం... అంబులెన్స్‌ల‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌

  • తొలి విడ‌త‌గా 175 అంబులెన్స్‌ల‌ను ప్రారంభించిన జ‌గ‌న్‌
  • మ‌లి విడ‌త‌లో అందుబాటులోకి రానున్న మ‌రో 165 అంబులెన్స్‌లు
  • సంచార ప‌శు వైద్య సేవ‌ల కోసం 1962 టోల్ ఫ్రీ నెంబ‌రు ఏర్పాటు
ap cm jagan flag off for YSR Sanchara Pashu Arogya Seva ambulences

ఏపీలో ఇక‌పై పాడి ప‌శువుల‌కూ సంచార వైద్యం ల‌భించ‌నుంది. ఈ మేర‌కు ప‌శువుల‌కు సంచార వైద్య సేవ‌ల కోసం రూపొందించిన వైఎస్సార్ సంచార ప‌శు ఆరోగ్య సేవ ప‌థ‌కాన్ని సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ కొత్త ప‌థ‌కంలో ప్ర‌త్యేకంగా రూపొందించిన అంబులెన్స్‌ల‌ను తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుంచి ఆయ‌న ప్రారంభించారు.

ఈ ప‌థ‌కంలో భాగంగా మొత్తం 340 అంబులెన్స్‌ల‌ను రూ.278 కోట్లు వెచ్చించి స‌మీక‌రిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి విడ‌త కింద రూ.143 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన 175 అంబులెన్స్‌ల‌ను జ‌గ‌న్ బుధ‌వారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప‌థ‌కం కింద పాడి రైతులు త‌మ గొర్రెలు, మేక‌ల‌కు వైద్య సేవ‌లు అవ‌స‌ర‌మైతే 1962 ట్రోల్ ఫ్రీ నెంబ‌రుకు ఫోన్ చేసి సంచార ప‌శు వైద్య సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు.

రాష్ట్రంలోని ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి రెండు చొప్పున అంబులెన్స్‌ల‌ను అందించ‌నున్నారు. రెండో విడ‌త కింద రూ.135 కోట్లు వెచ్చించి మ‌రో 165 అంబులెన్స్‌ల‌ను ప్ర‌భుత్వం కొనుగోలు చేయ‌నుంది. బుధ‌వారం అంబులెన్స్‌ల ప్రారంభోత్స‌వానికి మంత్రులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, సీదిరి అప్ప‌ల‌రాజు, చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

More Telugu News