Tamilnadu: ప‌ర‌స్ప‌రం ఢీ కొన్న రెండు బ‌స్సులు.. వీడియో ఇదిగో

  • త‌మిళ‌నాడులోని సాలెం జిల్లాలో ఘ‌ట‌న‌
  • దృశ్యాలు బ‌స్సులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డు
  • దాదాపు 30 మందికి గాయాలు
Two private buses collided head on with each other in Salem district

త‌మిళ‌నాడులో రెండు బ‌స్సులు ప‌ర‌స్ప‌రం ఢీ కొన్నాయి. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన దృశ్యాలు బ‌స్సులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డ‌య్యాయి. ఇందుకు సంబంధించిన‌ వీడియో మీడియాకు ల‌భ్య‌మైంది. సాలెం జిల్లాలో నిన్న సాయంత్రం ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో దాదాపు 30 మందికి గాయాల‌యిన‌ట్లు తెలుస్తోంది. 

క్ష‌ణాల వ్య‌వ‌ధిలో ఊహించ‌ని రీతిలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. బ‌స్సును ఢీ కొన్న వెంట‌నే మ‌రో బ‌స్సులోని డ్రైవ‌ర్ త‌న సీటులోంచి ఎగిరిప‌డ్డాడు. ఒక బ‌స్సులోని ముందు భాగం పూర్తిగా ధ్వంస‌మైన‌ట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.

More Telugu News