India: భారత్ లో తగ్గుతున్న కరోనా పాజిటివిటీ రేటు.. పూర్తి అప్డేట్స్ ఇవిగో!

  • గత 24 గంటల్లో 1,829 కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న వారు 2,549 మంది
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,647
India reports 1829 fresh cases

మన దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. గత 24 గంటల్లో 1,829 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,549 మంది కరోనా నుంచి కోలుకోగా... 33 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,31,27,199కి పెరిగింది. వీరిలో 4,25,87,259 మంది మహమ్మారి నుంచి కోలుకోగా... 5,24,293 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 15,647 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో రోజువారీ పాజిటివిటీ రేటు కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.42 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,91,65,00,770 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 14,97,695 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 

More Telugu News