Vehicle: హైదరాబాదులో బాలకృష్ణ నివాసం వద్ద వాహనం కలకలం

  • రోడ్డుపై వెళుతున్న అంబులెన్స్
  • అంబులెన్స్ కు దారిచ్చేందుకు యువతి యత్నం
  • డివైడర్ ఎక్కిన వాహనం
  • అదుపుతప్పి బాలయ్య ఇంటి వైపుకు దూసుకొచ్చిన వైనం
Speeding vehicle rams towards Balakrishna residence in Hyderabad

టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం వద్ద ఓ వాహనం (మహీంద్రా థార్) కలకలం రేపింది. బాలకృష్ణ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో నివాసం ఉంటున్నారు. థార్ వాహనం ఆయన ఇంటివైపు వేగంగా దూసుకెళ్లడమే కాకుండా, ఇంటి ఫెన్సింగ్ ను ఢీకొట్టింది. ఆ సమయంలో ఆ వాహనాన్ని ఓ యువతి నడుపుతున్నట్టు వెల్లడైంది. 

ఆ మార్గంలో ఓ అంబులెన్స్ వెళుతుండడంతో, దానికి దారిచ్చేందుకు యువతి తన వాహనాన్ని పక్కకి తీసే క్రమంలో అది రోడ్ డివైడర్ ఎక్కింది. దాంతో ఆ వాహనం అదుపుతప్పి బాలయ్య ఇంటివైపు దూసుకొచ్చింది. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దాంతో అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు.

More Telugu News