Congress: త‌న ఇంటిలో సీబీఐ సోదాల‌పై కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం స్పంద‌న ఇదే

  • కార్తి చిదంబరంపై వీసాల కేసు న‌మోదు
  • కార్తితో పాటు చిదంబ‌రం ఇళ్ల‌లో సీబీఐ సోదాలు
  • ఎఫ్ఐఆర్‌లో త‌న పేరే లేద‌న్న చిదంబ‌రం
  • సోదాల్లో సీబీఐ అధికారుల‌కే ఏమీ దొర‌క‌లేద‌ని వెల్ల‌డి
P Chidambaramm comments on cbi searches in his house

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబ‌రం ఇళ్లు, ఆయ‌న కుమారుడు కార్తి చిదంబ‌రం ఇళ్ల‌లో సీబీఐ అధికారులు మంగ‌ళ‌వారం సోదాలు నిర్వ‌హించారు. కార్తి చిదంబ‌రం రూ.50 ల‌క్ష‌లు లంచంగా తీసుకుని 250 మంది చైనా పౌరుల‌కు వీసాలు ఇప్పించార‌న్న ఆరోప‌ణ‌లపై కేసు న‌మోదు చేసిన సీబీఐ అధికారులు ఈ సోదాలు చేప‌ట్టారు. 

ఈ సోదాల‌పై మంగ‌ళ‌వారం సాయంత్రం చిదంబ‌రం స్పందించారు. అస‌లు కేసులో త‌న పేరు లేద‌ని చెప్పిన ఆయ‌న త‌న ఇంటిలో సీబీఐ అధికారులు ఎందుకు సోదాలు చేశార‌ని ప్ర‌శ్నించారు. చెన్నైలోని త‌న ఇల్లు, ఢిల్లీలోని త‌న అధికారిక నివాసంలోనూ సీబీఐ అధికారులు సోదాలు చేశార‌ని, సోదాల సంద‌ర్భంగా సీబీఐ అధికారులు త‌న‌కు ఎఫ్ఐఆర్ కాపీ చూపించార‌ని, అందులో త‌న పేరే లేద‌ని ఆయ‌న అన్నారు. సోదాల్లో భాగంగా త‌న ఇంటిలో ఏమీ దొర‌క‌లేద‌ని, ఎలాంటి ప‌త్రాల‌ను కూడా సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకోలేద‌ని ఆయ‌న తెలిపారు.

More Telugu News