Gotabaya Rajapaksa: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు ఊరట

  • ఇప్పటికే ప్రధాని పదవికి రాజీనామా చేసిన మహింద రాజపక్స
  • గొటబాయ రాజపక్సపై విపక్షాల అవిశ్వాస తీర్మానం 
  • గొటబాయపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
Relief to Sri Lanka president Gotabaya Rajapaksa

శ్రీలంక ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ దేశ ప్రధానమంత్రి మహింద రాజపక్స ప్రజాగ్రహం కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే పగ్గాలను చేపట్టారు. రణిల్ ప్రధాని అయిన తర్వాత శ్రీలంక పార్లమెంటు తొలిసారి సమావేశమయంది. ఈ సందర్భంగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. 


ఈ అవిశ్వాస తీర్మానాన్ని తమిళ్ నేషనల్ అలయన్స్ ఎంపీ సుమంథిరన్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షం ఎస్ జేబీ ఎంపీ లక్ష్మణ్ కిరియెల్లా కూడా మద్దతు పలికారు. ఈ అవిశ్వాస తీర్మానాన్ని 119 మంది ఎంపీలు వ్యతిరేకించగా... 68 మంది ఎంపీలు మద్దతు పలికారు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మరో వైపు దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడమే తన ప్రధాన లక్ష్యమని రణిల్ విక్రమసింఘే తెలిపారు.

More Telugu News