Ramcharan: చరణ్ .. శంకర్ సినిమా విషయంలో ప్లాన్ మార్చేసిన దిల్ రాజు!

  • షూటింగు దశలో చరణ్ 15వ సినిమా
  • ఇప్పటికే కొంత చిత్రీకరణ పూర్తిచేసిన శంకర్  
  • సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనను వాయిదా వేసిన దిల్ రాజు
  • సంక్రాంతి బరిలో విజయ్ - వంశీ పైడిపల్లి సినిమాను దింపాలనే నిర్ణయం  
shankar and Charan movie update

చరణ్ .. శంకర్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ చకచకా జరుగుతోంది. కెరియర్ పరంగా ఇది చరణ్ కి 15వ సినిమా. ఇప్పటికే ఈ సినిమా కొన్ని షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. రీసెంట్ గా వైజాగ్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఆ తరువాత షెడ్యూల్స్ ను హైదరాబాద్ .. మారేడుమిల్లిలో ప్లాన్ చేశారు.

ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన బ్యానర్ పై నిర్మితమవుతున్న 50వ సినిమా ఇది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని దిల్ రాజు భావించారు. అయితే ఈ సినిమా షూటింగు పార్టు ఇంకా  చాలానే మిగిలి ఉంది. అందువలన ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయాలనే నిర్ణయానికి దిల్ రాజు వచ్చాడని అంటున్నారు. 

ఇక మరోపక్క, ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపాలనే ఆలోచనకి దిల్ రాజు వచ్చాడని చెబుతున్నారు. ఇందులో విజయ్ జోడీగా రష్మిక అలరిస్తుందనే సంగతి తెలిసిందే. 
       

 

More Telugu News