Andrew Symonds: జీర్ణించుకోలేని వార్త ఇది.. సైమండ్స్ మరణం పట్ల విషాదంలో క్రికెట్ ప్రపంచం

  • ఆల్ రౌండరే కాదు.. ఫీల్డింగ్ మెరుపన్న సచిన్
  • ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా సహా క్రికెటర్ల సంతాపం
  • రిప్ రాయ్ అంటూ ట్విట్టర్ లో సంతాపాల వెల్లువ
Cricket Fraternity Mourns The death of Andrew Symonds

ఆండ్రూ సైమండ్స్ మరణాన్ని క్రికెట్ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. అతడి హఠాన్మరణంతో దిగ్భ్రాంతికి గురైంది. పలువురు ప్రముఖులు అతడి మరణంపై ట్విట్టర్ లో స్పందిస్తూ సంతాపం వ్యక్తం చేశారు. వారి మాటల్లోనే...

  • ఆండ్రూ సైమండ్స్ మరణం షాక్ కు గురి చేసింది. అతడి మరణ వార్త జీర్ణించుకోలేనిది. అత్యంత గొప్ప ఆల్ రౌండరే కాదు.. ఫీల్డింగ్ లో మెరుపు కూడా. ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పుడు అతడితో ఎన్నో మరచిపోలేని అనుభూతులున్నాయి. అతడి ఆత్మకు శాంతి చేకూరాలి. అతడి కుటుంబం, స్నేహితులకు సానుభూతిని తెలియజేస్తున్నా.     – సచిన్ టెండూల్కర్
  • సైమండ్స్ మరణం బాధాకరం. అతడి ఫ్యామిలీ, స్నేహితులకు సానుభూతి.  – ఐసీసీ
  • 46 ఏళ్ల వయసులోనే సైమండ్స్ చనిపోవడం దిగ్ర్భాంతికి గురి చేసింది. అతడు లేని లోటు పూడ్చలేనిది.  – క్రికెట్ ఆస్ట్రేలియా
  • షాకింగ్ వార్తతో నిద్ర లేచాను. నా ప్రియ స్నేహితుడి ఆత్మకు శాంతి చేకూరాలి.    – వీవీఎస్ లక్ష్మణ్
  • సైమండ్స్ మరణ వార్త బాధించింది. అతడి ఆత్మకు శాంతి కలగాలి. అతడి కుటుంబానికి ఆ దేవుడు శక్తిసామర్థ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నా.   – విరాట్ కోహ్లీ
  • చాలా బాధాకరమైన వార్త. సైమండ్స్ కుటుంబం, స్నేహితులకు నా సానుభూతి.  – అనిల్ కుంబ్లే
  • ఇంత భయంకరమైన వార్తతో నిద్ర లేవాల్సి వస్తుందనుకోలేదు. అతడి మరణం గుండెను పిండేసింది. సైమండ్స్ ను మేమంతా మిస్ అయిపోతాం.    – జాసన్ గిలెస్పీ
  • అత్యంత విధేయుడు, సరదా, ప్రేమించే స్నేహితుడు. ప్రేమిస్తే ఏదైనా చేసే మనస్తత్వం. అదీ రాయ్ అంటే.   – ఆడమ్ గిల్ క్రిస్ట్
  • సిమ్మో.. ఇది నిజమనిపించట్లేదు.     – మైకేల్ వాన్
  • హృదయాన్ని కలచివేస్తోంది. రాయ్ చాలా సరదా మనిషి. అతడి కుటుంబానికి సానుభూతి.     – డేమియన్ ఫ్లెమింగ్
  • సైమండ్స్ మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మైదానం లోపల, బయటా మంచి సంబంధాలున్నాయి.   – షోయబ్ అక్తర్
  • సైమండ్స్ మరణం విషాదకరం. రిప్ రాయ్.     – కోల్ కతా నైట్ రైడర్స్
  • సైమండ్స్ మరణ వార్త ఎంతో బాధించింది. అతడి ఆత్మకు శాంతి కలగాలి. – ముంబై ఇండియన్స్

More Telugu News