AP High Court: కోర్టు ధిక్కర‌ణ కేసులో ఏపీ ఐఏఎస్‌కు 3 నెల‌ల జైలు

  • ఐఏఎస్ హ‌రి నారాయ‌ణ‌కు 3 నెల‌ల జైలుశిక్ష 
  • అప్పీల్ చేసుకునేందుకు 6 వారాల పాటు శిక్ష అమ‌లు వాయిదా
  • విస్తృత ధ‌ర్మాస‌నం స్టే ఇవ్వ‌కుంటే స్వ‌యంగా లొంగిపోవాల‌ని కోర్టు ఆదేశం
ap high court sentences 3 months jail to ias hari narayana

ఏపీ కేడ‌ర్‌కు చెందిన మ‌రో ఐఏఎస్ అధికారికి కోర్టు ధిక్క‌ర‌ణ‌లో 3 నెల‌ల జైలు శిక్ష ఖ‌రారైంది. ఈ మేర‌కు ఏపీ హైకోర్టు శ‌నివారం కీల‌క తీర్పు చెప్పింది. గ్రేట‌ర్ విశాఖ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీవీఎంసీ) క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేసిన ఐఏఎస్ అధికారికి 3 నెల‌ల జైలు శిక్షను విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. విశాఖ న‌గ‌రంలో వీధి వ్యాపారుల‌కు సంబంధించి కోర్టు జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను అమ‌లు చేయ‌ని కార‌ణంగా హ‌రి నారాయ‌ణ‌కు ఈ శిక్ష ఖ‌రారైంది.

అయితే ఈ శిక్ష అమ‌లును 6 వారాలు వాయిదా వేస్తూ హైకోర్టు ఏక స‌భ్య ధ‌ర్మాస‌నం తీర్పు వెలువ‌రించింది. నిందితుడు విస్తృత ధ‌ర్మాస‌నంలో తీర్పును స‌వాల్ చేసుకునేందుకే ఈ వెసులుబాటు ఇస్తున్న‌ట్లు కోర్టు తెలిపింది. విస్తృత ధ‌ర్మాస‌నంలో కూడా ఈ తీర్పుపై స్టే విధించ‌క‌పోతే.. జూన్ 16న హ‌రి నారాయ‌ణ స్వ‌యంగా హైకోర్టు రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాల‌ని కూడా కోర్టు ఆదేశించింది.

More Telugu News