Imran Khan: దీనికంటే అణు బాంబు వేయడం బెటర్: ఇమ్రాన్ ఖాన్

  • ఇటీవలే ప్రధాని పదవి నుంచి బలవంతంగా దిగిపోయిన ఇమ్రాన్
  • దేశాధికారం దొంగల చేతిలో ఉందని వ్యాఖ్య
  • దొంగలు అన్ని వ్యవస్థలను నాశనం చేశారని విమర్శ  
Better we bomb nuclear weapon on our own land says Imran Khan

పాకిస్థాన్ ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ బలవంతంగా దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని పగ్గాలను మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాధికారాన్ని దొంగలకు అప్పగించడం కన్నా... దేశంపై అణు బాంబు వేయడం ఉత్తమమని అన్నారు. 

తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరులు ఇప్పుడు తనకు సలహాలు ఇవ్వాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఈ నెల 20న ఇస్లామాబాద్ లో లాంగ్ మార్చ్ నిర్వహిస్తానని... తనను ఆపే శక్తి ఎవరికీ లేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన దొంగలు అన్ని వ్యవస్థలను నాశనం చేశారని చెప్పారు. అధికారంలో ఉన్న నేరగాళ్ల కేసులను ఇప్పుడు ఏ అధికారి దర్యాప్తు చేస్తాడని ప్రశ్నించారు.

More Telugu News