PBKS: స‌త్తా చాటిన లివింగ్ స్టోన్‌, బెయిర్‌స్టో!... పంజాబ్ స్కోరు 209 ప‌రుగులు

  • బెంగళూరు ల‌క్ష్యం 210 ప‌రుగులు
  • 70 ప‌రుగుల‌తో రాబ‌ట్టిన‌ లివింగ్ స్టోన్‌
  • బెయిర్‌స్టో బ్యాటు నుంచి 66 ర‌న్స్‌
  • హ‌ర్ష‌ల్ ప‌టేల్‌కు 4 వికెట్లు
  • ప‌రుగులు భారీగా స‌మ‌ర్పించుకున్న సిరాజ్
210 is the target to punjab kings

ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో శుక్ర‌వారం ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట‌ర్లు లివింగ్ స్టోన్‌, బెయిర్ స్టో వీర విహారం చేశారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశారు. వీరిద్ద‌రి సూప‌ర్ ఇన్నింగ్స్‌ల‌తో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్ జ‌ట్టు ఏకంగా 209 ప‌రుగులు చేసింది. లివింగ్ స్టోన్ 70 ప‌రుగుల‌తో రాణించ‌గా... బెయిర్ స్టో 66 ప‌రుగులు రాబ‌ట్టాడు. ఓ వైపు వ‌రుస‌గా వికెట్లు ప‌డుతున్నా... వీరి‌ద్ద‌రు మాత్రం త‌మ బ్యాట్ల‌ను ఝుళిపించారు. 
ఇక బెంగ‌ళూరు బౌలింగ్ విష‌యానికి వ‌స్తే... హ‌ర్ష‌ల్ ప‌టేల్ ఏకంగా 4 వికెట్లు తీసుకున్నాడు. వనిందు హ‌స‌రంగాకు రెండు వికెట్లు ద‌క్క‌గా... మ్యాక్స్‌వెల్‌, షాబాద్ అహ్మ‌ద్‌కు చెరో వికెట్ ద‌క్కింది. ఇక మ‌న హైద‌రాబాదీ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు వికెట్లేమీ ద‌క్క‌క‌పోగా.... ఓవ‌ర్‌కు 18 ప‌రుగుల చొప్పున స‌మ‌ర్పించుకుని పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌ర‌చాడు. మ‌రికాసేప‌ట్లో 210 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బెంగళూరు ఛేజింగ్ ప్రారంభించ‌నుంది.

More Telugu News