YSRCP: కేంద్ర మంత్రులు నిర్మ‌ల‌, గోయ‌ల్‌ల‌కు జ‌గ‌న్ లేఖ‌.. ఆవ నూనెపై సుంకం తగ్గించాల‌ని విన‌తి

  • యుద్ధం కార‌ణంగా స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌కు కొర‌త‌
  • ఫ‌లితంగా మండుతున్న‌ వంట నూనెల ధ‌ర‌లు
  • ఆవ నూనెపై సుంకం త‌గ్గింపుతో ఉప‌శ‌మ‌నమ‌న్న‌ జ‌గ‌న్‌
ap cm ys jagan letters to union ministers nirmala sitharaman and piyush goyal

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం కేంద్ర మంత్రులు నిర్మ‌లా సీతారామ‌న్‌, పీయూష్ గోయ‌ల్‌ల‌కు లేఖ‌లు రాశారు. ఆవ‌నూనెపై సుంకాన్ని త‌గ్గించాల‌ని ఈ లేఖ‌ల్లో ఆయ‌న కేంద్ర మంత్రుల‌ను కోరారు. ఉక్రెయిన్‌, ర‌ష్యాల మ‌ధ్య యుద్ధం కార‌ణంగా స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌కు తీవ్ర కొర‌త ఏర్ప‌డిన విష‌యాన్ని ఆయ‌న త‌న లేఖ‌ల్లో ప్ర‌స్తావించారు. ఈ కార‌ణంగా వంట నూనెల ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోయాయ‌ని, ఈ ధ‌ర‌ల నుంచి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కాస్తంతైనా ఉప‌శ‌మ‌నం క‌ల‌గాలంటే ఆవ నూనెపై కేంద్రం విధిస్తున్న సుంకాల‌ను ఏడాది పాటు త‌గ్గించాల‌ని కేంద్ర మంత్రుల‌ను జ‌గ‌న్ కోరారు.

More Telugu News