P Narayana: నారాయ‌ణ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై 24న విచార‌ణ‌

  • టెన్త్ క్వ‌శ్చ‌న్ పేప‌ర్ల లీకేజీలో అరెస్టయిన నారాయ‌ణ‌
  • రిమాండ్‌కు పంపకముందే బెయిల్‌ మంజూరు 
  • బెయిల్ ర‌ద్దు చేయాలంటూ ఏపీ స‌ర్కారు పిటిష‌న్‌
  • విచార‌ణ‌కు స్వీక‌రించిన చిత్తూరు కోర్టు
  • నారాయ‌ణ‌కు నోటీసుల జారీ
narayana bail cancel petition hearing on 24th ofthis month

టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి నారాయ‌ణకు మంజూరైన బెయిల్‌ను ర‌ద్దు చేయాలంటూ ఏపీ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను చిత్తూరు జిల్లా కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఈ పిటిష‌న్‌పై ఈ నెల 24న విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు కోర్టు ప్ర‌క‌టించింది. అంతేకాకుండా ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై స్పందించాలంటూ నారాయ‌ణ‌కు కోర్టు నోటీసులు జారీచేసింది.

టెన్త్ క్వ‌శ్చ‌న్ పేప‌ర్ల లీకేజీ వ్య‌వ‌హారంలో ప‌ట్టుబ‌డిన వారంతా నారాయ‌ణ విద్యా సంస్థ‌ల‌కు చెందిన‌వారేన‌న్న ప్రాథమిక స‌మాచారంతో... ఆ విద్యా సంస్థ‌ల చైర్ ప‌ర్స‌న్ హోదాలో ఉన్నారంటూ నారాయ‌ణ‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం విద్యాసంస్థలకు చైర్మన్ హోదాలో లేరంటూ నారాయణ న్యాయవాదులు ఆధారాలతో చేసిన వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్ ను ర‌ద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో ఏపీ ప్ర‌భుత్వం పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

More Telugu News