Surya: 'ఖైదీ' సీక్వెల్ లో సూర్య కూడానా?

  • తక్కువ బడ్జెట్ లో రూపొందిన కార్తి 'ఖైదీ'
  • కాసుల వర్షం కురిపించిన సినిమా ఇది
  • సీక్వెల్ కి సిద్ధమవుతున్న మేకర్స్ 
  • సూర్య కూడా ఈ సినిమాలో కనిపించనున్నాడంటూ  ప్రచారం
Khaidi Movie has Sequel

కార్తి 'ఖైదీ' సినిమా చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఈ సినిమా కోసం భారీస్థాయిలో ఎలాంటి ఖర్చు పెట్టలేదు. భారీ స్థాయిలో ఎలాంటి సెట్లు వేయలేదు. కథలో కనిపించేవి మూడే మూడు. ఒకటి పోలీస్ స్టేషన్ .. రెండోది గర్ల్స్ హాస్టల్ .. మూడోది విలన్ డెన్. విలన్ గ్యాంగ్ నుంచి పోలీసులను ఒక ఖైదీ కాపాడటమనే లైనే కొత్తగా ఉంటుంది.
 
సినిమా మొత్తంలో ఆర్టిస్టులంతా సింగిల్ కాస్ట్యూమ్ తోనే కనిపిస్తారు. అయినా ఎక్కడా బిగి తగ్గకుండా నడిచే ఈ కథ కాసుల వర్షం కురిపించింది. అందువలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తో సీక్వెల్ చేయడానికి కార్తి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య కూడా చేయనున్నాడనేది తాజా సమాచారం.

'ఖైదీ' సినిమాను నిర్మించిన ఎస్.ఆర్.ప్రభు ఈ సీక్వెల్ ను కూడా నిర్మించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. సూర్య - కార్తి కలిసి ఈ హిట్ మూవీ సీక్వెల్లో నటిస్తే మరింత క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు. 'విక్రమ్' ను రిలీజ్ కి రెడీ చేస్తున్న లోకేశ్ కనగరాజ్, ఆ తరువాత ప్రాజెక్టుగా ఈ సినిమా చేయనున్నాడు.

More Telugu News