Mahinda Rajapaksa: దేశాన్ని వదిలిపోకుండా మహింద రాజపక్స, ఇతర నేతలపై నిషేధం విధించిన శ్రీలంక కోర్టు

  • శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం
  • ప్రధాని పదవికి రాజీనామా చేసిన మహింద రాజపక్స
  • మహిందకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్
  • విచారణ జరిపిన న్యాయస్థానం
Sri Lanka court bans Mahinda Rajapaksa and other leaders from leaving country

ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్ర స్థితికి చేరిన నేపథ్యంలో శ్రీలంక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఇతర మిత్రపక్ష నేతలు దేశం విడిచిపోకుండా కోర్టు నిషేధం విధించింది. కోర్టు నిషేధం విధించిన వారిలో రాజపక్స తనయుడితో పాటు మరో 15 మంది మిత్రపక్ష నేతలు కూడా ఉన్నారు. 

రాజపక్సకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే, రాజపక్సను, ఆయన అనుయాయులను అరెస్ట్ చేయాలన్న పిటిషనర్ విన్నపాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. తమకు అనుమానాస్పదంగా అనిపిస్తే దేశంలో ఎక్కడైనా అరెస్ట్ చేసే అధికారాలు పోలీసులకు వున్నాయని స్పష్టం చేశారు.

More Telugu News