Vizag: విశాఖ రుషికొండపై తవ్వకాలను ఆపేయాలంటూ ఎన్జీటీ ధర్మాసనం ఆదేశం

  • జీఎస్టీలో పిటిషన్ వేసిన రఘురామకృష్ణరాజు
  • తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు తవ్వకాలను చేపట్టకూడదంటూ స్టే 
  • తవ్వకాలపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసిన జీఎస్టీ బెంచ్
NGT orders to stop excavations on Rushi Konda

నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ సముద్రానికి ఆనుకుని ఉన్న రుషికొండపై జరుగుతున్న తవ్వకాలను తక్షణమే ఆపేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తవ్వకాలపై స్టే విధించింది. తాము తదుపరి ఉత్తర్వులను ఇచ్చేంత వరకు తవ్వకాలను చేపట్టకూడదని ఆదేశించింది. 

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై ఈ నెల 6న ఎన్జీటీ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఇప్పటి వరకు రుషికొండలో జరిపిన తవ్వకాలపై అధ్యయనం చేసేందుకు సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ కోస్టల్ జోన్, ఏపీ కోస్టల్ మేనేజ్ మెంట్ అథారిటీ, నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ మేనేజ్ మెంట్ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. నోడల్ ఏజెన్సీగా ఏపీ కోస్టల్ మేనేజ్ మెంట్ అథారిటీ వ్యవహరిస్తుందని తెలిపింది. నెల రోజుల్లోగా నివేదికను అందించాలని ఆదేశించింది.

More Telugu News