Faria Abdullah: కోలీవుడ్ బాట పట్టిన ఫరియా అబ్దుల్లా!

  • 'జాతిరత్నాలు'తో పరిచయమైన ఫరియా
  • తెలుగులో అంతగా పలకరించని అవకాశాలు
  • కోలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకునే దిశగా అడుగులు 
  • విజయ్ ఆంటోని సరసన నాయికగా ఛాన్స్
Faria Abdullah in Vijay Antony Movie

తెలుగు తెరపై కథానాయికగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నించిన తెలుగు అమ్మాయిలలో ఫరియా అబ్దుల్లా ఒకరు. 'జాతిరత్నాలు' సినిమాతో తొలి ప్రయత్నంలోనే ఈ బ్యూటీ సక్సెస్ తో పాటు మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సుందరిని వరుసగా అవకాశాలు వరించడం .. ఆమె హవా కొనసాగడం ఖాయమని అంతా అనుకున్నారు.

కానీ అలాంటిదేమీ జరగలేదు. రవితేజ సినిమా 'రావణాసుర'లో ఆ ఐదుగురు హీరోయిన్స్ లో ఆమె ఒకరుగా కనిపించనుంది. ఇక ఆ తరువాత చేతిలో ప్రాజెక్టులు లేవు. దాంతో బిందుమాధవి .. స్వాతి రెడ్డి .. ఆనంది .. అంజలి మాదిరిగానే ఫరియా కూడా  కోలీవుడ్ బయటపెట్టేసింది.

 తమిళంలో విజయ్ ఆంటోని హీరోగా  ఒక సినిమా రూపొందుతోంది. ఆ సినిమాలో ఆయన సరసన నాయికగా ఆమె నటించనుందని అంటున్నారు. సుశీంద్రన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఫరియా పల్లెటూరి యువతిగా కనిపించనుందని అంటున్నారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమా విడుదల కానుంది.   

More Telugu News