Chiranjeevi: చిరంజీవి 'గాడ్ ఫాదర్' కూడా అదే రోజు వస్తుందట!

  • మలయాళంలో హిట్ కొట్టిన 'లూసిఫర్'
  • తెలుగు రీమేక్ గా వస్తున్న 'గాడ్ ఫాదర్'
  • ఈ నెల 12వ తేదీన  రిలీజ్ చేసే ఆలోచన 
  • అదే రోజున బరిలో ఉన్న మూడు సినిమాలు  
God Father movie upadate

చిరంజీవి 'కథానాయకుడిగా 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందుతోంది. మలయాళ 'లూసిఫర్'కి ఇది రీమేక్. సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారితో కలిసి చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలకమైన పాత్రను పోషిస్తుండటం విశేషం. నయనతార .. సత్యదేవ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. మెగా అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఆగస్టు 12వ తేదీన థియేటర్లలో దింపాలనే ఆలోచన చేస్తున్నారట.
 
కంటెంట్ పరంగా ఈ సినిమా ఆగస్టు 15 నాటికి థియేటర్లలో ఉండేలా చూడాలని భావించారట. అందువల్లనే ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా సమాచారం. అదే రోజున సమంత .. అఖిల్ .. నితిన్ సినిమాలో బరిలో ఉండటం విశేషం. మలయాళంలో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా, తెలుగు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.

More Telugu News