Corona Virus: నోటి టీకాతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట.. మాత్ర రూపంలో వ్యాక్సిన్

  • అడినోవైరస్‌ను వాహకంగా ఉపయోగించుకునేలా టీకా అభివృద్ధి
  • నోటి నుంచి వెలువడే తుంపర్లను ఇది తగ్గిస్తుందన్న శాస్త్రవేత్తలు
  • ఇంజక్షన్ ద్వారా తీసుకునే టీకాతో పోలిస్తే మెరుగంటున్న పరిశోధకులు
Researchers develop vaccine Pill for corona

మాత్రల రూపంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు.. దీని వల్ల కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. కరోనా రోగుల నోటి నుంచి వెలువడే తుంపర్ల సంఖ్యను ఈ సరికొత్త టీకా గణనీయంగా తగ్గిస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టు అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు తెలిపారు. అడినోవైరస్‌ను వాహకంగా ఉపయోగించుకునేలా అభివృద్ధి చేసిన ఈ టీకాను నోటీ ద్వారా తీసుకోవచ్చని పేర్కొన్నారు. 

రక్తంలోను, ఊపిరితిత్తుల్లోనూ ఇది యాంటీబాడీలను సమర్థంగా తయారుచేస్తుందన్నారు. ఫలితంగా కరోనా వైరస్ నుంచి అది రక్షణ కల్పిస్తుందని వివరించారు. అంతేకాదు, ఇంజక్షన్ ద్వారా తీసుకునే టీకాతో పోలిస్తే ఈ నోటి టీకా ‘ఇమ్యునోగ్లోబ్యులిన్-ఎ (ఐజీ-ఎ)ను అధికంగా ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు వెలువడే తుంపర్ల నుంచి వెలువడే వైరస్ కణాల సంఖ్యను తగ్గించడంలో ఐజీ-ఎ కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు తెలిపారు.

More Telugu News