Avatar-2: జల ప్రపంచాన్ని ఆవిష్కరించిన అవతార్-2... టీజర్ ట్రైలర్ ఇదిగో!

  • జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి అవతార్
  • తాజాగా సీక్వెల్ 'అవతార్-2' 
  • డిసెంబరు 16న వస్తున్న సినిమా  
  • టీజర్ ట్రైలర్ ను పంచుకున్న చిత్రబృందం
Avatar 2 teaser trailer out now

ప్రపంచ వెండితెరపై అవతార్ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. అనేక భాషల్లోకి డబ్ అయిన ఈ చిత్రం నిర్మాతలకు డాలర్ల వర్షం కురిపించింది. 2009లో జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ ఆస్కార్ వేదికపైనా అవార్డులు కొల్లగొట్టింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ వస్తోంది. అవతార్-2 ఈ ఏడాది డిసెంబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా అవతార్-2కి చెందిన టీజర్ ట్రైలర్ ను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. ఈసారి అవతార్ లో సముద్ర లోకాన్ని ఆవిష్కరించినట్టు టీజర్ ట్రైలర్ చెబుతోంది. అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలం అడుగడుగునా దర్శనమిస్తోంది. మొత్తమ్మీద టీజర్ ట్రైలర్ తోనే అవతార్-2పై అమితమైన ఆసక్తి రేకెత్తించారు.

More Telugu News