TDP: మా అధినేత పొత్తుల గురించి మాట్లాడితే వైసీపీ ఉలిక్కిప‌డుతోంది: బుద్ధా వెంక‌న్న‌

  • టీడీపీ పొత్తులు ఎప్పుడూ బ‌హిరంగ‌మేన‌న్న వెంకన్న 
  • వైసీపీ ర‌హ‌స్య ఒప్పందాల మాటేమిట‌ని ప్ర‌శ్న‌
  • ప్ర‌జాస్వామ్య ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌కే చీడ‌పురుగులాంటిది వైసీపీ అంటూ విమర్శ  
budda venkanna satires on ysrcp

త‌మ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు పొత్తుల గురించి మాట్లాడితే వైసీపీ ఉలిక్కిప‌డుతోంద‌ని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. టీడీపీ పొత్తు ఎప్ప‌టికైనా బ‌హిరంగంగానే జ‌రుగుతుంద‌ని ఆయన పేర్కొన్నారు. టీడీపీ పొత్తులు అభ్యంత‌ర‌మైతే.. వైసీపీ తెర వెనుక అనైతిక, అస‌హ్య‌క‌ర చీక‌టి పొత్తుల సంగ‌తేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

తెలంగాణ నుంచి మూట‌లు, జాతీయ‌పార్టీల ఆశీస్సులు, పెద్దిరెడ్డి టూరిస్టు ఓట‌ర్లు, ప్ర‌శాంత్ కిశోర్ పేటీఎం బ్యాచులు, పింక్ డైమండ్ నాట‌కం, కోడిక‌త్తి డ్రామా, బాబాయ్ గుండె పోటు, ప్ర‌జాస్వామ్య ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌కే చీడ‌పురుగులాంటిది వైసీపీ అంటూ వెంక‌న్న మండిప‌డ్డారు.  

More Telugu News