Panja Vaisshnav Tej: కొత్తగా లేదేంటి .. 'రంగ రంగ వైభవంగా' లిరికల్ సాంగ్ రిలీజ్!

  • రొమాంటిక్ లవ్ స్టోరీగా 'రంగ రంగ వైభవంగా'
  • వైష్ణవ్ తేజ్ తో జోడీకట్టిన కేతిక శర్మ
  • సంగీత దర్శకత్వం వహించిన దేవిశ్రీ ప్రసాద్
  • మంచి మార్కులు కొట్టేసే రొమాంటిక్ సాంగ్ 
Ranga Ranga Vaibhavanga song released

వైష్ణవ్ తేజ్ - కేతిక శర్మ జంటగా 'రంగ రంగ వైభవంగా' సినిమా రూపొందింది. తెలుగు 'అర్జున్ రెడ్డి'ని తమిళంలో రీమేక్ చేసిన గిరీశాయ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ పాటికే ఈ సినిమా విడుదల కావలసింది. అయితే వరుసగా పెద్ద సినిమాలు బరిలోకి దిగుతూ ఉండటం వలన వెయిట్ చేస్తూ వచ్చింది.

బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ రోజు ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. 'కొత్తగా లేదేంటి .. కొత్తగా లేదేంటి ఇంత దగ్గరున్న నువ్వు నేను కొత్తగా లేదేంటి' అంటూ నాయికా నాయకుల మధ్య ఈ పాట సాగుతోంది.

దేవిశ్రీ బీట్ చాలా బాగుంది .. ఆయన ఈ పాటను అర్మాన్ మాలిక్ - హరిప్రియతో రొమాంటిక్ గా .. మత్తుగా పాడించిన తీరు బాగుంది.  శ్రీమణి కూడా సున్నితమైన పద ప్రయోగాలు చేశాడు. మొదటిసారి వినగానే యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఈ పాట ఉంది. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి పాటల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News