YSRCP: న్యూ లుక్‌లో విజ‌య‌సాయిరెడ్డి... స‌జ్జ‌ల‌తో భేటీలో బ‌య‌ట‌కొచ్చిన‌ ఫొటో

  • గుండుతో క‌నిపిస్తున్న సాయిరెడ్ది
  • స‌జ్జ‌లతో భేటీ సంద‌ర్భంగా కొత్త లుక్‌లో వైసీపీ ఎంపీ
  • పార్టీకి చెందిన అంశాల‌పై స‌జ్జ‌ల‌తో చ‌ర్చించిన‌ట్టు వెల్ల‌డి
ysrcp general secretary vijay sai reddy in new look

ఏపీలో అధికార పార్టీ వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంటులో ఆ పార్టీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి ఓ కొత్త లుక్‌లో క‌నిపించారు. ఆయ‌న గుండు చేయించుకున్న త‌ర్వాత అప్పుడ‌ప్పుడే మొలుస్తున్న వెంట్రుకల‌తో స‌రికొత్త లుక్కులో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఇలా గుండు చేయించుకున్న లుక్కులో విజ‌య‌సాయిరెడ్డి ఇప్ప‌టిదాకా ఎప్పుడూ క‌నిపించ‌లేదు. ఈ లుక్కులో విజ‌య‌సాయిరెడ్డి ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. 

శుక్ర‌వారం నాడు వైసీపీకి చెందిన మ‌రో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితో విజ‌య‌సాయిరెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీకి చెందిన ప‌లు అంశాల‌పై వారిద్ద‌రూ చ‌ర్చించుకున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా విజ‌య‌సాయిరెడ్డే ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు. స‌జ్జ‌ల‌తో తాను భేటీ అయిన ఫొటోను కూడా ఆయ‌నే స‌ద‌రు ట్వీట్‌కు జ‌త చేశారు. 

More Telugu News