Vidadala Rajini: శవపరీక్షకు లంచం డిమాండ్ చేసిన వైద్యుడిపై వేటు... ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్న మంత్రి రజని

  • నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఘటన
  • ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సందాని బాషా 
  • మృతుడి భార్య నుంచి రూ.15 వేలు డిమాండ్
  • కలెక్టర్ నివేదిక ఆధారంగా డాక్టర్ పై వేటు
  • ఇలాంటి వాళ్లను ఉపేక్షించబోమన్న మంత్రి రజని
Vidadala Rajini fires on govt doctor who asked bribe

నెల్లూరు జిల్లాలో ఓ వైద్యుడు శవపరీక్షకు లంచం డిమాండ్ చేసిన విషయం విదితమే. డాక్టర్ సందాని బాషా ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్నారు. అయితే, పోస్టుమార్టం నిమిత్తం మృతుడి భార్య నుంచి రూ.15 వేలు డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ నివేదిక మేరకు ప్రభుత్వం ఆ వైద్యుడ్ని విధుల నుంచి తొలగించింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రభుత్వ వైద్యుడు లంచం అడగడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రి విడదల రజని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేద ప్రజలను ఇబ్బందిపెట్టే వైద్యులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

More Telugu News