India: ఇండియాలో 20 వేలకు చేరువవుతున్న కరోనా యాక్టివ్ కేసులు

  • గత 24 గంటల్లో దేశంలో 3,205 కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,802
  • దేశ వ్యాప్తంగా మరో 31 మంది మృతి
Corona active cases in India reaching 20K

దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి కంటే కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్యే ఎక్కువగా ఉంది. నిన్న కూడా 3 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3,205 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,802 మంది కోలుకోగా... 31 మంది మృతి చెందారు. 

ఇక తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,30,88,118కి చేరుకుంది. ఇప్పటి వరకు 4,25,44,689 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,23,920కి చేరింది. ప్రస్తుతం దేశంలో 19,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

కోలుకుంటున్న వారి కంటే కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో... దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. మరణాల రేటు 1.22 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 1,89,48,01,203 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.

More Telugu News