KA Paul: టీఆర్ఎస్ ఆగడాలు సాగనివ్వను.. మళ్లీ సిరిసిల్లకు వెళ్తా.. చంపేస్తారా?: కేఏ పాల్

  • రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానన్న పాల్ 
  • డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్ కుమారే తనపై దాడి చేయించారని ఆరోపణ 
  • నిన్న పాల్‌ను కలిసిన బస్వాపూర్ రైతులు
Again will Go to sircilla are you killed me asks KA Paul

టీఆర్ఎస్ ఆగడాలు ఇక సాగనివ్వబోనని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని తన కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను మళ్లీ సిరిసిల్లకు వెళ్తానని, ఈసారి అరెస్ట్ చేస్తారా? చంపుతారా? అని ప్రశ్నించారు. ఇటీవల తనపై జరిగిన దాడిని డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్ కుమారే చేయించారని పాల్ ఆరోపించారు.

మరోవైపు, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామ రైతులు నిన్న పాల్‌ను హైదరాబాద్‌లో కలిశారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ. లక్ష నుంచి రూ. 3 లక్షలు పరిహారంగా ఇవ్వాలని, అది కూడా ఐదు రోజుల్లో అందించాలని ప్రభుత్వాన్ని పాల్ డిమాండ్ చేశారు. లేదంటే ఆ పరిహారమేదో తానే అందిస్తానని, అందుకు అనుమతి ఇవ్వాలని పాల్ ప్రభుత్వాన్ని కోరినట్టు రైతులు తెలిపారు.

More Telugu News