Chiranjeevi: 'గాడ్ ఫాదర్' కోసం రంగంలోకి దిగిన ప్రభుదేవా!

  • ముగింపు దశలో ఉన్న చిరంజీవి 'గాడ్ ఫాదర్'
  • ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న సల్మాన్ 
  • ప్రభుదేవా కొరియోగ్రఫీలో ఇద్దరి ఆటా పాట
  • త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారట  
Prabhudeva in God Father Movie

చిరంజీవి తదుపరి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'గాడ్ ఫాదర్' రెడీ అవుతోంది. ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో మోహన్ లాల్ కి మంచి పేరు తెచ్చిపెట్టిన 'లూసిఫర్' సినిమాకి ఇది రీమేక్.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. చిరూ  .. సల్మాన్ లపై ఒక పాటను చిత్రీకరించడానికి సన్నాహాలు చేశారు. ఈ పాటకి కొరియోగ్రఫీ చేయించడానికి ప్రభుదేవాను రంగంలోకి దింపారు. ఈ  ఇద్దరితోను ప్రభుదేవా కలిసి పనిచేశారు. ఇద్దరి బాడీ లాంగ్వేజ్ లు ఆయనకి బాగా తెలుసు.

ఈ సాంగును ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిపే ఆలోచనలో ఉన్నారు. ప్రభుదేవా కూడా తన వైపు నుంచి గట్టిగానే కసరత్తు చేశాడని అంటున్నారు. నయనతార కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో, ఓ జర్నలిస్ట్ పాత్రలో పూరి జగన్నాథ్ కనిపించనుండటం విశేషం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

More Telugu News