Balakrishna: బాలయ్య 107వ చిత్రం టైటిల్ ఇదేనంటూ జోరుగా ప్రచారం!

  • గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107వ చిత్రం
  • బాలయ్య సరసన నటిస్తున్న శ్రుతిహాసన్
  • 'అన్నగారు' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు ప్రచారం 
Balakrishna 107th movie title is fixed

బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా దిక్కుతోచని స్థితికి వెళ్లిన ఇండస్ట్రీకి 'అఖండ' అంతులేని ధైర్యాన్ని అందించింది. ఈ చిత్రం తర్వాత భారీ చిత్రాలన్నీ వరుసగా విడుదలయ్యాయి. 

మరోవైపు ప్రస్తుతం తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది. శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. 'అఖండ' తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. 

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేయగా... ఆ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా టైటిల్ ఏంటనే చర్చ కొన్ని రోజులుగా సాగుతోంది. సోషల్ మీడియాలో జై బాలయ్య, నటసింహం, పెద్దన్నయ్న వంటి పేర్లు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ సినిమాకు 'అన్నగారు' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తాజా సమాచారం. జూన్ 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్, టైటిల్ ను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం  చేస్తున్నారు.

More Telugu News